భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం జంగల్ రాజు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 14 జేపీ వాయిస్ టుడే;
త్యాగం, భక్తిశ్రద్ధల సమాహారంగా తెలుగునాట వినాయక చవితి పండగ వాతావరణం ఉత్సాహభరితంగా సాగుతోంది. నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం జంగల్ రాజు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
విఘ్నాలను తొలగించి, సర్వజనుల కోరికలను నెరవేర్చే బొజ్జ గణపయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఊరూరా వెలసిన గణనాథుల మండపాలు భక్తిపారవశ్యంతో నిండిపోవాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాతో వర్ధిల్లాలని ఆ గణేశుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతామని, అందరూ ఐక్యమత్యంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
Andhra
భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం జంగల్ రాజు
Quick Summary:
భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం జంగల్ రాజు