గంగరాజు పోడులో మార్మోగిన హస్తం నినాదం: అంబటి మురళి, గండ్ర సురేందర్ రెడ్డిల జోరుగా ప్రచారం
గంగరాజు పోడు:
రైల్వే కోడూరు జై భీమ్ నవంబర్ 1 జై భీమ్ వాయిస్ టుడే:
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో ఎన్నికల వేడి పెరిగింది. గంగరాజు పోడు పంచాయతీ పరిధిలో జడ్పీటీసీ అభ్యర్థి అంబటి మురళి, ఎంపీటీసీ అభ్యర్థి గండ్ర సురేందర్ రెడ్డి ఈరోజు వీధివీధినా విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను కలసి, వారిని పలకరిస్తూ తమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ చేతి గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల వాతావరణం ఊపందుకున్న నేపథ్యంలో ప్రజలు సైతం అభ్యర్థుల పర్యటనకు ఉత్సాహంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
Andhra
గంగరాజు పోడులో మార్మోగిన హస్తం నినాదం: అంబటి మురళి, గండ్ర సురేందర్ రెడ్డిల జోరుగా ప్రచారం
Quick Summary:
గంగరాజు పోడులో మార్మోగిన హస్తం నినాదం: అంబటి మురళి, గండ్ర సురేందర్ రెడ్డిల జోరుగా ప్రచారం

