వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన తల్లేం రమణారెడ్డి
రైల్వేకోడూరు సెప్టెంబర్ 12 జై భీమ్ వాయిస్ టుడే:
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ నాయకులు తల్లేం రమణారెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని మంగంపేట, కాపుపల్లి ప్రజలతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలందరికీ ఆయన పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విఘ్నాలు తొలగించే గణనాథుడు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరేలా ఆశీర్వదించాలని ప్రార్థించారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక భావనతో, ఐక్యమత్యంతో ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.
Andhra
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రైల్వే కోడూరు సీనియర్ నాయకులు పారిశ్రామికవేత్త రమణారెడ్డి
Quick Summary:
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రైల్వే కోడూరు సీనియర్ నాయకులు పారిశ్రామికవేత్త రమణారెడ్డి