శ్రమజీవుల పురోగతికే విశ్వకర్మ యోజన
ఓబులవారిపల్లిలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 17 జై భీమ్ వాయిస్ టుడే :
విశ్వకర్మ జయంతి శ్రామికులకు, చేతివృత్తిదారులకు అత్యంత పవిత్రమైన దినమని భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం ముక్కా రూపేష్ రెడ్డి గార్డెన్‌లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం చెంగల్ రాజు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను, విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒబిసి మోర్చా నేతృత్వంలో నిర్వహించిన "విశ్వకర్మ ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ" ఆశీర్వాద దీపం కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో విజయవంతమైంది.
ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా వృత్తిదారులు తమ పనిముట్లు, పరికరాలకు పూజలు చేశారు. తమ వృత్తినే దైవంగా భావించే శ్రమజీవుల కృషికి గౌరవం కల్పిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షును కాంక్షిస్తూ ప్రజలు ఆశీర్వాద దీపాలు వెలిగించారు. దేశం మరింత అభివృద్ధి చెంది ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని, భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ, నిర్మాణ నైపుణ్యానికి, సృజనాత్మకతకు విశ్వకర్మ భగవానుడు ఆదిగురువని కొనియాడారు. తరతరాలుగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రమజీవులకు, చేతివృత్తిదారులకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సాంప్రదాయ వృత్తులను తక్కువ చేసి చూపిస్తూ, శ్రమజీవులను తమ సంస్కృతి నుంచి వేరు చేసేలా విదేశీ భావజాలంతో కూడిన మే డేను ప్రోత్సహించాయని విమర్శించారు. దీనివల్ల సాంప్రదాయ వృత్తిదారులు తమ జీవనోపాధిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందరి సహకారం - అందరి వికాసం అనే నినాదంతో ప్రధాని మోడీ వెనుకబడిన వర్గాల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. విశ్వకర్మ యోజన, ముద్రా, స్వనిధి, ప్రధాని ఉపాధి కల్పన వంటి పథకాలు చిన్న వ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కేసవరాజు, ఒబిసి మోర్చా నాయకులు సురేష్ రాజు, పోకల బాలాజీ, వేణుగోపాల్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, ఆరుమళ్ల సుబ్బరాయుడు, వెంకటయ్య, హరి, రాకేష్, అనిల్, శశిధర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, శ్రామికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
శ్రమజీవుల పురోగతికే విశ్వకర్మ యోజన ఓబులవారిపల్లిలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
Quick Summary:
శ్రమజీవుల పురోగతికే విశ్వకర్మ యోజన ఓబులవారిపల్లిలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
