Andhra
ఆయుర్వేద దినోత్సవం
Quick Summary:
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కొనకంచి గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద కేంద్రంలో బుధవారం డాక్టర్ కే వాణి సుమారు 60 మంది రోగులను పరీక్షించారు. ఆయుర్వేద గురువు ధన్వంత్రి వల్ల వైద్యం అందుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా రోగంతో బాధపడుతున్న బాధితులు ఆయుర్వేదం రోగాలు తగ్గాయని తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ధన్వంతరి పూజతో పాటు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ రెడ్డి, మహిళా పోలీసు కృష్ణవేణి, గ్రామస్తులు, రోగులు, యోగా శిక్షకులు సురేష్, మణి పాల్గొన్నారు. డాక్టర్ కొల్లూరు వాణిని గ్రామస్తులు, రోగులు సత్కరించారు.