అనంతయ్యగారిపల్లిలో హోరెత్తిన కూటమి ప్రచారం: పాల్గొన్న ముక్కా రూపానంద రెడ్డి
రైల్వే కోడూరు అక్టోబర్ 31 జై భీమ్ వాయిస్ టుడే:
స్థానిక ఎన్నికల వేళ గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లితో పాటు బీసీ కాలనీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచార పర్వం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. నియోజకవర్గ నాయకుడు, కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ముక్కా రూపానంద రెడ్డి గ్రామంలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి జాగువారిపల్లి శంకర్ రెడ్డి, పుల్లంపేట జడ్పీటీసీ అభ్యర్థి ముద్ద సుభాష్ రెడ్డి (గంగిరెడ్డి)లకు మద్దతుగా ఆయన ఓటర్లను నేరుగా అభ్యర్థించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటర్లతో మమేకమైన ఆయన, రాబోయే రోజుల్లో ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా సంక్షేమం ముమ్మరంగా సాగాలంటే కూటమి అభ్యర్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నమ్మకమైన నాయకత్వాన్ని ఆశీర్వదించి కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని కట్టబెట్టాలని ఆయన ఓటర్లను ఆకాంక్షించారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
Andhra
అనంతయ్యగారిపల్లిలో హోరెత్తిన కూటమి ప్రచారం: పాల్గొన్న ముక్కా రూపానంద రెడ్డి
Quick Summary:
అనంతయ్యగారిపల్లిలో హోరెత్తిన కూటమి ప్రచారం: పాల్గొన్న ముక్కా రూపానంద రెడ్డి
