జైభీమ్ వాయిస్ టుడే న్యూస్
నందిగామ, అక్టోబర్ 12:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పరిధిలోని అనాసాగరం గ్రామ ప్రజల చిరకాల అవసరమైన ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ సోమవారం ప్రారంభమైంది. గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తోడ్పాటుతో పాటు, నందిగామ పీఏసీఎస్ చైర్మన్ కొట్టే హరికృష్ణ (బద్రి) సహాయ సహకారాలతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి రిక్వెస్ట్ స్టాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ స్టాప్‌తో అనాసాగరం ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
పీఏసీఎస్ చైర్మన్ కొట్టే హరికృష్ణ (బద్రి) మాట్లాడుతూ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహకారంతో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
గ్రామంలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేసినందుకు అనాసాగరం ప్రజలు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పీఏసీఎస్ చైర్మన్ కొట్టే హరికృష్ణ (బద్రి)లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తుటారి కృష్ణ, దుగ్గిదేవి గోపి, రామిరెడ్డి రమేష్, ఆర్టీసీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Andhra
అనాసాగరంలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ప్రారంభం
Quick Summary:
అనాసాగరంలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ప్రారంభం