ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్సార్: చిన్నఓరంపాడు క్రాస్ వద్ద ఘనంగా నివాళులు
రైల్వే కోడూరు సెప్టెంబర్ జై భీమ్ వాయిస్ టుడే:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు క్రాస్ వద్ద అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ వేంచేసి ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పరిపాలనలో సంక్షేమానికి కొత్త భావన నేర్పిన మహానేత సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు స్మరించుకున్నారు.
ఈ నివాళి కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ టంగుటూరు కృష్ణారెడ్డి, ఉప మండల పరిషత్ అధ్యక్షుడు గౌరీ శంకర్ రాజు, ఓబులవారిపల్లి మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి, రాయలసీమ ప్రాంతీయ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి సుంకేసుల రఫీ, చిన్నఓరంపాడు మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, మండల ప్రాదేశిక ప్రాంత ప్రాతినిధ్య సభ్యుడు దుర్గాప్రసాద్, అనిల్ స్వామి పాల్గొన్నారు. వీరితో పాటు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ప్రతాపు, బూత్ కమిటీ కార్యదర్శి దీపక్ రెడ్డి, దుర్గయ్య, ప్రేమ, రహమతుల్లా, యేసయ్య, సుబ్బరామయ్య, చంటి, సుబ్రహ్మణ్యం, వెంకటసుబ్బయ్య, రమణ, షేక్ బాషా, రహీము తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరై మహానేతకు అంజలి ఘటించారు.
Andhra
ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్సార్: చిన్నఓరంపాడు క్రాస్ వద్ద ఘనంగా నివాళులు
Quick Summary:
చిన్నవరంపాడు క్రాస్ రోడ్డు వద్ద వైయస్సార్ కి ఘన నివాళులు