*జైభీమ్ వాయిస్ టుడే జగ్గయ్యపేట సెప్టెంబర్ 26//
జగ్గయ్యపేట పట్టణంలోని 23వ వార్డు మంగళ బజార్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 15వ రోజు గడపగడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో నెలకొన్న స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నేరుగా ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు.
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాడటమే గడపగడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, 23వ వార్డు అధ్యక్షుడు షేక్ ఫయాజ్, గుంజ రోశయ్య, భోగ్యం నవీన్ తదితర వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
ప్రజా సమస్యలే ఎజెండాగా.. ప్రతి గడపకూ వైఎస్ఆర్ సీపీ నేతలు
Quick Summary:
జగ్గయ్యపేటలో 15వ రోజు గడపగడపకు ప్రజా పోరుబాట