అనారోగ్య పీడిత నాయకుడికి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల పరామర్శ
రైల్వేకోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు బండారు శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యుడు కోరముట్ల శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం బుడుగుంటపల్లి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కోరముట్ల, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు మాదినేని వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, తిరుపతి సూరి, జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి రాజా (గని), రాజా రామయ్య, సిద్దయ్య, నాగేశ్వర్ రెడ్డి, దాసరి వంశీ తదితరులు పాల్గొన్నారు.
Andhra
అనారోగ్య పీడిత నాయకుడికి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల పరామర్శ
Quick Summary:
అనారోగ్య పీడిత నాయకుడికి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల పరామర్శ