భక్తిశ్రద్ధల నడుమ కొర్లకుంటలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
రైల్వే కోడూరు అక్టోబర్ జై భీమ్ వాయిస్ టుడే:
ఓబులవారిపల్లి మండలంలోని కొర్లకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమద్ సమేత స్వామివార్ల విగ్రహాలు, కలశ ధ్వజస్తంభం మరియు అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, పూజలు వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా సాగింది. గ్రామస్తుల ప్రత్యేక ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం గావించారు. గ్రామంలో ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపనతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోందని, స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై కలకాలం నిలిచి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఏపీఎండీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, అన్నమయ్య జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షుడు సుబ్బారామరాజు, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు గౌరీ శంకర్ రాజు, మాజీ సర్పంచ్ రఫీతో పాటు పలువురు సీనియర్ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Andhra
భక్తిశ్రద్ధల నడుమ కొర్లకుంటలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
Quick Summary:
భక్తిశ్రద్ధల నడుమ కొర్లకుంటలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
