విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులతో ప్రతి ఇంటా పసిడి కాంతులు
రైల్వేకోడూరు సెప్టెంబర్ 13 జై భీమ్ వాయిస్ టుడే:
విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులతో తిరుపతి జిల్లాతో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పాటూరు శ్రీనివాసులురెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంతో పాటు చిట్వేలి మండల ప్రజలకు ఆయన చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్తిశ్రద్ధలు, సాంప్రదాయ బద్ధమైన వాతావరణంలో ఆత్మీయతల నడుమ వినాయక చవితి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పొరుగువారితో కలిసి సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణతోనే నిజమైన భక్తి
ఉత్సవాల వేళ ప్రజల భద్రత, ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పాటూరు సూచించారు. శబ్ద కాలుష్యానికి దూరంగా ఉంటూ చిన్నారులు, వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సహజ సిద్ధమైన మట్టి విగ్రహాలనే పూజల్లో ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. నీటి వనరులు కలుషితం కాకుండా నిమజ్జన కార్యక్రమాలు సాగాలని, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. మన భక్తి ప్రకృతికి భారంగా మారకుండా, రాబోయే తరాలకు మేలు చేసేలా ఉత్సవాలు జరపడమే నిజమైన పండుగ స్ఫూర్తి అని పేర్కొన్నారు.
గణనాథుని కృపతో జిల్లా వ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతాంగం కుటుంబాల్లో సిరిసంపదలు, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు నెలకొనాలని ఆయన ఆకాక్షించారు. ప్రజలందరి ఐక్యత, భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన సహకారంతో రైల్వేకోడూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలని పాటూరు శ్రీనివాసులురెడ్డి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra
విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులతో ప్రతి ఇంటా పసిడి కాంతుల తో వర్ధిల్లాలి–టిడిపి నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి
Quick Summary:
విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులతో ప్రతి ఇంటా పసిడి కాంతుల తో వర్ధిల్లాలి–టిడిపి నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి