మాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం – తిరుపతి, రైల్వే కోడూరులలో త్వరలో ఎంఆర్ఎస్ఎస్ కార్యాలయాలు
రైల్వే కోడూరుఅక్టోబర్ 1 జై భీమ్ వాయిస్ టుడే:
సామాజిక సాధికారత సాధనతో పాటు మాలల హక్కుల పరిరక్షణే ముఖ్యాజెండాగా మాలల రాజ్యాధికార సాధన సమితి కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో ఎంఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు డేగల మహేష్ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతితో పాటు తిరుపతి జిల్లా పరిధిలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో సైతం త్వరలోనే ప్రత్యేక నియోజకవర్గ కార్యాలయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న జ్వలంత సమస్యలపై నిరంతరం పోరాడేందుకు, సమాజంలో అత్యధిక జనాభా కలిగిన మాల వర్గాల బలమైన గొంతుకను పాలకులకు వినిపించేందుకు ఈ కార్యాలయాలు వేదికలుగా నిలవనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మాల వర్గాల సముచిత హక్కుల సాధనతో పాటు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది రాజ్యాధికారంలో తగిన భాగస్వామ్యం పొందడమే ఆశయంగా మాలల రాజ్యాధికార సాధన సమితి ఒక చారిత్రాత్మక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగి ఉండి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మాలలకు రాజకీయంగా తగిన గౌరవం, సముచిత భాగస్వామ్యం దక్కకపోవడం పట్ల సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాజకీయ చైతన్యంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐక్యపోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు.
Andhra
మాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం – తిరుపతి, రైల్వే కోడూరులలో త్వరలో ఎంఆర్ఎస్ఎస్ కార్యాలయాలు
Quick Summary:
మాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం – తిరుపతి, రైల్వే కోడూరులలో త్వరలో ఎంఆర్ఎస్ఎస్ కార్యాలయాలు
