ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకత్వ పటిమ: తెదేపా శిక్షణ తరగతుల్లో వైయస్సార్ కడప పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
రైల్వే కోడూరు సెప్టెంబర్ 7 జై భీమ్ వాయిస్ టుడే:
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశంతో ప్రజాక్షేత్రంలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు నాయకులు, కార్యకర్తలు సద్ధం కావాలని వైయస్సార్ కడప పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్మన్, నియోజకవర్గ ఇన్-ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకత్వ శిక్షణ సదస్సులో ఆయన ప్రతినిధిగా హాజరయ్యారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాపాలనలో నాయకులు అనుసరించాల్సిన శైలి, నైపుణ్యాల పెంపుదలపై ప్రత్యేక మార్గదర్శనం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు.
సమావేశం అనంతరం కుడా ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, అధినేత అందించిన మార్గదర్శకాలు నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ లబ్ధిని ప్రజలకు వేగంగా చేరవేసేందుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. పాలనా సంస్కరణలు, ప్రజా సంక్షేమ లక్ష్యాల సాధన దిశగా రాబోయే రోజుల్లో విస్తృత కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్-ఛార్జ్ లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Andhra
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకత్వ పటిమ: తెదేపా శిక్షణ తరగతుల్లో వైయస్సార్ కడప పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
Quick Summary:
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకత్వ పటిమ: తెదేపా శిక్షణ తరగతుల్లో వైయస్సార్ కడప పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి