స్థానిక పోరులో కమల వికాసమే లక్ష్యం: తిరుపతిలో భాజపా జిల్లా కార్యవర్గ భేటీ ఘనంగా నిర్వహణ
తిరుపతి సెప్టెంబర్ 7 జై భీమ్ వాయిస్ టుడే:
తిరుపతిలో భాజపా తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో భాజపా విజయావకాశాలను పెంచేలా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబరు 17 నుండి అక్టోబరు 17 వరకు నెల రోజుల పాటు విస్తృతంగా నిర్వహించనున్న సేవా పక్షోత్సవాల కార్యాచరణను మధుకర్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడేలా బహుళ సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వాములై విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో భాజపాను క్షేత్రస్థాయి నుంచి మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్యకర్తా అంకితభావంతో పనిచేయాలని మధుకర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల పోరులో విజయం సాధించడమే ధ్యేయంగా కమలదళం సమాయత్తం కావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో రైల్వేకోడూరు నియోజకవర్గం నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం చెంగల్రాయులు, ఐదు మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
స్థానిక పోరులో కమల వికాసమే లక్ష్యం: తిరుపతిలో భాజపా జిల్లా కార్యవర్గ భేటీ ఘనంగా నిర్వహణ
Quick Summary:
స్థానిక పోరులో కమల వికాసమే లక్ష్యం: తిరుపతిలో భాజపా జిల్లా కార్యవర్గ భేటీ ఘనంగా నిర్వహణ

