విజయదశమి శోభ... ప్రతి ఇంటా వెలగాలి సంతోషాల దివ్వెలు
రైల్వే కోడూరు: ప్రకృతిని పూజించే విశిష్ట పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి సాంస్కృతిక ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకల శుభవేళ ఓబులవారిపల్లె మండలం ఎల్లయ్యపల్లె మాజీ సర్పంచ్ జరుగు నారాయణ రెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని సమస్త ప్రజానీకానికి, స్వేద బిందువులను నమ్ముకుని నేలను నమ్ముకున్న కర్షక లోకానికి, నిరంతరం కష్టపడే శ్రామిక సోదరులకు, రాజకీయ నాయకులకు మరియు వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా విజయదశమి ఆకాంక్షలు అందజేశారు.
ఈ శుభ సందర్భంలో ఆయన మాట్లాడుతూ... సమాజంలో అధర్మం నశించి ధర్మం విజిలించే దివ్య సమయమిదని పేర్కొన్నారు. జగజ్జనని దుర్గామాత దివ్య కరుణాకటాక్షాలతో రైతాంగానికి పంటలు సమృద్ధిగా పండి, శ్రామికులకు తగిన ప్రతిఫలం లభించి, నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ప్రార్థించారు. పండుగ తెచ్చే నూతన ఉత్సాహంతో ప్రజలందరూ ఐక్యతను చాటుతూ, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఆనందోత్సవాల మధ్య ఈ విజయదశమి మహోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.
Andhra
విజయదశమి శోభ... ప్రతి ఇంటా వెలగాలి సంతోషాల దివ్వెలు
Quick Summary:
విజయదశమి శోభ... ప్రతి ఇంటా వెలగాలి సంతోషాల దివ్వెలు