*జైభీమ్ వాయిస్ టుడే నందిగామ, సెప్టెంబర్ 26:* నందిగామ పట్టణంలో ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ కింద 45 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. శుక్రవారం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.Go.Ms.No.30 ప్రకారం 2019కు ముందు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని, ఇంటి పన్ను రసీదులు కలిగి ఉండి దరఖాస్తు చేసుకున్న వారిలో 45 మందిని అర్హులుగా గుర్తించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీరికి సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా వేలాది మంది లబ్ధిదారులకు పట్టాలు అందించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా స్థాయిలో కూడా వెల్లడైంది.
అర్హులైన 45 మంది లబ్ధిదారులకు సంబంధించిన భూమి మొత్తం 3,746.68 చదరపు గజాలు, సుమారు 0.775 ఎకరాలు కాగా, ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.3.91 కోట్లుగా ఉందని సౌమ్య వివరించారు. 45 మందిలో APL కింద ఆరుగురు, BPL కింద 39 మంది ఉన్నారని, కులాల వారీగా OC–10, BC–26, SC–5, ST–4 మంది ఉన్నారని తెలిపారు.
150 చదరపు గజాల లోపు నివేశన స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు, అంతకుమించిన స్థలాలకు ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తయిన రెండు సంవత్సరాల అనంతరం స్థలాల విక్రయానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.దరఖాస్తులకు డిసెంబర్ 31 వరకు అవకాశం2019కు ముందు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని, ఇంటి పన్ను రసీదులు కలిగి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులకు డిసెంబర్ 31, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తంగిరాల సౌమ్య తెలిపారు. అర్హులైన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Andhra
నందిగామలో 45 కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు.
Quick Summary:
నందిగామలో 45 కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు.