కొత్తపల్లిలో వైభవంగా గణపతి పూజలు: శుభాకాంక్షలు తెలిపిన తల్లెం కుమార్ రెడ్డి
రైల్వే కోడూరు, సెప్టెంబర్ 14 జై భీమ్ వాయిస్ టుడే:
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గుంతకల్లు రైల్వే బోర్డు సభ్యుడు తల్లెం కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని రాళ్లచెరువుపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో వెలసిన గణపయ్యను దర్శించుకుని, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం గ్రామ ప్రజలు, భక్తులకు చవితి శుభాకాంక్షలు అందజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Andhra
కొత్తపల్లిలో వైభవంగా గణపతి పూజలు: శుభాకాంక్షలు తెలిపిన తల్లెం కుమార్ రెడ్డి
Quick Summary:
కొత్తపల్లిలో వైభవంగా గణపతి పూజలు: శుభాకాంక్షలు తెలిపిన తల్లెం కుమార్ రెడ్డి