మట్టి వినాయకుడినే పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
రైల్వే కోడూరు13 జై భీమ్ వాయిస్ టుడే: వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరూ మట్టి ప్రతిమలనే ప్రతిష్టించి, పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. రసాయన రంగులు పూసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడటం వల్ల మన జలవనరులు, జీవకోటి తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వినాయక చవితి వేడుకలు ప్రకృతికి దగ్గరగా ఉండాలనేది మన సాంప్రదాయమని, ఆచారాల పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టడం తగదని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితమై జలచరాలు మృత్యువాత పడుతున్నాయని, దీనివల్ల భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రకృతిని దైవంగా భావించే భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాల వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సహజసిద్ధమైన పద్ధతుల్లో పండుగను జరుపుకొని ముక్కోటి దేవతల ఆశీస్సులు పొందాలని గల్లా శ్రీధర్ ఆకాంక్షించారు.
Andhra
మట్టి వినాయకుడినే పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం బిజెపి సీనియర్ నేత గల్లా శ్రీధర్
Quick Summary:
మట్టి వినాయకుడినే పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం బిజెపి సీనియర్ నేత గల్లా శ్రీనివాసులు