నందిగామ: నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీ శాఖమూరు వంశీధర్ గారి పేరును తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.
గతంలో చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించబడిన డాక్టర్ కందుల అప్పారావు గారి పేరు సాంకేతిక కారణాల వల్ల ఓటరు జాబితాలో నమోదు కాకపోవడంతో ఆయన స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగారు.
ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు వంశీధర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది.
అభ్యర్థిగా ఖరారైన అనంతరం శాఖమూరు వంశీధర్ - స్వర్ణ దంపతులు నందిగామలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సౌమ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య గారు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా పనిచేయాలని ఆకాంక్షించారు.
Andhra
నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శాఖమూరు వంశీధర్ ఖరారు
Quick Summary:
నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శాఖమూరు వంశీధర్ ఖరారు