జైభీమ్ వాయిస్ టుడే న్యూస్ |
ఎన్టీఆర్ జిల్లాలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. “ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఆయుర్వేదం” అనే థీమ్‌తో కలెక్టరేట్ కార్యాలయం నుంచి డాక్టర్ ఎ.ఎల్. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, డాక్టర్ ఎన్.ఆర్.ఎస్. ఆయుర్వేద వైద్య కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్రజల్లో ఆయుర్వేద వైద్య విధానం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్నారైస్ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బుల్లయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్, కొనకంచి డాక్టర్ కొల్లూరు శ్రీవాణి, డాక్టర్ లలిత, డాక్టర్ మురళి, మెడికల్ ఆఫీసర్లు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Andhra
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
Quick Summary:
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ