వధూవరులను ఆశీర్వదించిన ముక్కా రూపానంద రెడ్డి
రైల్వే కోడూరు సెప్టెంబర్ 6 జై భీమ్ వాయిస్ టుడే:
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం లింగిరెడ్డిపల్లెలో ఆదివారం నాడు వివాహ వేడుక వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన ఏనుగుల కృష్ణయ్య, పార్వతమ్మ దంపతుల కుమారుడు రెడ్డి ప్రసాద్, వెంకటవనజల పరిణయ మహోత్సవం బంధుమిత్రుల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. వేదికపై కళ్యాణ వేడుకను వీక్షించిన ఆయన, నూతన వధూవరులకు పూలమాలలు అందించి మంగళాశాసనాలు అందజేశారు. కొత్త దంపతులు నూరేళ్ల పంటగా, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధుల రాకతో వివాహ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ వేడుకలో ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Andhra
వధూవరులను ఆశీర్వదించిన ముక్కా రూపానంద రెడ్డి
Quick Summary:
వధూవరులను ఆశీర్వదించిన ముక్కా రూపానంద రెడ్డి

