వీరబోయిన బాన్విక విష్ణుశ్రీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
రైల్వేకోడూరు సెప్టెంబర్ 9 జై భీమ్ వాయిస్ టుడే: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం వి.వి. కండ్రికకు చెందిన వీరబోయిన బాన్విక విష్ణుశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, ఉషారాణి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.ఎం. రాచపల్లి ఎస్సీ కాలనీ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడి పాఠశాలకు బిందెతో పాటు స్వీట్లు అందజేశారు.
పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పాఠశాల సిబ్బంది, స్థానికులు పేర్కొన్నారు.
విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా ఉందని బాన్విక విష్ణుశ్రీ తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, ఉషారాణి తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.
Andhra
పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Quick Summary:
వీరబోయిన బాన్విక విష్ణుశ్రీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
