దీక్షా బంధన అలంకారంలో భక్తులకు కొలువుదీరిన కన్యకా పరమేశ్వరి
రైల్వేకూరు జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వేకూరు మండలంలోని స్థానిక పొట్టి శ్రీరాములు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు దివ్యమైన దీక్షా బంధన అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విశేషమైన ఆసక్తి చూపారు. అమ్మవారి దివ్యరూప దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఆలయ ప్రాంగణమంతా భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. రైల్వేకూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకుని అమ్మవారి కృపాశీస్సులు పొందాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన సంఘం సభ్యులు, మహిళా మండలి సభ్యులు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసినట్లు తెలిపారు.
Andhra
దీక్షా బంధన అలంకారంలో భక్తులకు కొలువుదీరిన కన్యకా పరమేశ్వరి
Quick Summary:
దీక్షా బంధన అలంకారంలో భక్తులకు కొలువుదీరిన కన్యకా పరమేశ్వరి
