టిడిపి ఇంచార్జ్ రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్
రైల్వే కోడూరు సెప్టెంబర్ 25 జై భీమ్ వాయిస్ టుడే:
ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యంగా నాయకులు అడుగులు వేస్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని రాఘవరాజుపురంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ ఇబ్బందులు, వినతులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అర్జీలు స్వీకరించిన రూపానంద రెడ్డి, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ అధికారులతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని, అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కొరత, ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాల పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఏ గ్రామానికి ఎలాంటి మౌలిక వసతులు అవసరమో వివరాలు తెలుసుకుంటూ, ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Andhra
టిడిపి ఇంచార్జ్ రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్
Quick Summary:
టిడిపి ఇంచార్జ్ రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్
