జైభీమ్ వాయిస్ టుడే నందిగామ
నందిగామ మండలలో దసరా సెలవు రోజుల్లో తరగతులు
నిర్వహించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ *ఎస్ఎఫ్ఐ నందిగామ మండలకార్యదర్శి షేక్ ఖజూ,మాట్లాడుతూ* నందిగామలోని కొన్ని జూనియర్ కళాశాలలు స్కూళ్లల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవులు ఇవ్వకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు.నందిగామ నగరంలో ఉన్న జూనియర్ కళాశాలలు కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూళ్లల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుంటే విద్యార్థులను బయటికి పంపించేశామని చెప్పారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సెలవు దినాల్లో తరగతులు నిర్వహించకుండా చూడాలని,అలా నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు షేక్.హస్సన్, గోపీచంద్,షేక్.షఫీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..*
Andhra
*దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలి :- (ఎస్ఎఫ్ఐ)*
Quick Summary:
*దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలి :- (ఎస్ఎఫ్ఐ)*