గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహర్దశ – లక్ష్మి గాడ్డెన్ ఎస్టీ కాలనీలో పశువుల షెడ్ల నిర్మాణానికి భూమిపూజ
రైల్వే కోడూరు అక్టోబర్ 1 జై భీమ్ వాయిస్ టుడే:
గ్రామీణ ప్రాంతాలలో పశుపోషణను ప్రోత్సహించి రైతాంగానికి, పశుపోషకులకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ మూడో విడత కార్యక్రమం ఊపందుకుంది. రైల్వే కోడూరు మండలం వీపీఆర్ కండ్రిగ పంచాయతీ పరిధిలోని లక్ష్మి గాడ్డెన్ ఎస్టీ కాలనీలో వి.బి.జి. రామ్‌జీ నిధులతో నిర్మించనున్న పశువుల షెడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైల్వేకోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ముఖ్య అతిథులుగా హాజరై శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు. పశువులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పశుపోషకులకు ఆర్థికంగా చేయూత లభించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లె పండుగ మూడో విడత ద్వారా ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి మృత్యుంజయ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జాతీయ ప్రజాస్వామ్య కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహర్దశ – లక్ష్మి గాడ్డెన్ ఎస్టీ కాలనీలో పశువుల షెడ్ల నిర్మాణానికి భూమిపూజ
Quick Summary:
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహర్దశ – లక్ష్మి గాడ్డెన్ ఎస్టీ కాలనీలో పశువుల షెడ్ల నిర్మాణానికి భూమిపూజ
