విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు: తల్లెం భరత్ కుమార్ రెడ్డి
రైల్వే కోడూరు, సెప్టెంబర్ 17 జై భీమ్ వాయిస్ టుడే:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం అప్పగుంటపల్లి హరిజనవాడలో గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన దార్ల రమణయ్య, దార్ల రామసుబ్బయ్య, అంబారపు రమణయ్యల ప్రత్యేక ఆహ్వానం మేరకు రాయలసీమ ప్రాంత ప్రాతినిధ్య సమితి అధ్యకక్షుడు, రైల్వే సలహా మండలి సభ్యుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
మండపానికి చేరుకున్న ఆయనకు స్థానికులు, వేడుకల నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నాయకులు మంగళం శీను, పవన్, శీను, నరేందర్ రెడ్డి, మహేష్, శీను, మొగులేటి రమణ, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, నవీన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు: తల్లెం భరత్ కుమార్ రెడ్డి
Quick Summary:
విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు: తల్లెం భరత్ కుమార్ రెడ్డి