రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు పంతగాని నరసింహ ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
ప్రజల్లో సేవాభావం పెంపొందాలని, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయదశమి పండగను పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు, నిరంతరం సమాజ సేవలో తరిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలకు, శ్రామికులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు, అనధికారులకు మరియు పాత్రికేయులకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పండుగలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా పరస్పర ప్రేమను, సహాయ గుణాన్ని చాటుకునే దివ్య వేదికలని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్న సేవా సంస్థలు, కార్మికులు మరియు నిత్యం వార్తలను ప్రజలకు చేరవేస్తున్న పాత్రికేయుల కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, నియోజకవర్గంలో శాంతి, సౌభాగ్యాలు విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
Andhra
రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు పంతగాని నరసింహ ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు
Quick Summary:
రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు పంతగాని నరసింహ ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు