జైభీమ్ వాయిస్ టుడే కంచికచర్ల
కంచికచర్ల: మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. నిమజ్జనానికి తరలివెళుతున్న గణనాథుడి ప్రతిమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగియడం పట్ల నిర్వాహకులు, భక్తులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
Andhra
గణనాథుడి నిమజ్జనానికి ఘనంగా వీడ్కోలు
Quick Summary:
గణనాథుడి నిమజ్జనానికి ఘనంగా వీడ్కోలు