ఎంపీటీసీ అభ్యర్థిగా బండి క్రిష్ణయ్య నామినేషన్
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే: మండల రాజకీయాల్లో ఎంపీటీసీ ఎన్నికల ఘట్టం ఊపందుకుంది. ఓబులవారిపల్లి–2 ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ల పర్వంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండి క్రిష్ణయ్య బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఉదయం 8:30 గంటలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. అభ్యర్థి విజయానికి శ్రేణులంతా సమన్వయంతో కృషి చేస్తూ, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నామినేషన్ సమర్పణతో స్థానిక పరిధిలో ఎన్నికల సందడి మరింత వేడెక్కింది.
Andhra
ఎంపీటీసీ అభ్యర్థిగా బండి క్రిష్ణయ్య నామినేషన్
Quick Summary:
ఎంపీటీసీ అభ్యర్థిగా బండి క్రిష్ణయ్య నామినేషన్