రైల్వేకోడూరులో ఆర్‌పీఐ (అథవాలే) పార్టీ కార్యాలయం ప్రారంభం
రైల్వేకోడూరు, అక్టోబర్ 5మనసులో మాట:
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ శిల్పి అంబేడ్కర్ ఆశయాలు, భావజాలాన్ని దిశానిర్దేశంగా మలచుకుని ముందుకు సాగాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ - అథవాలే) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చారు. ఆదివారం రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలో ఆర్‌పీఐ (అథవాలే) నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన, పేద వర్గాలకు అండగా నిలవడమే లష్యంగా పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని స్పష్టం చేశారు. అంబేడ్కర్ బాటలోనే దేశ ప్రగతి సాధిస్తుందని, ప్రతీ కార్యకర్త ఆ భావజాలాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ఉద్బోధించారు.
ఈ వేడుకలో ఆర్‌పీఐ (అథవాలే) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, జిల్లా అధ్యక్షులు చోడవరం సుబ్బ నరసయ్య, కడప రమణలతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభంతో స్థానిక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా, కార్యక్రమాన్ని విజవంతం చేసేందుకు నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో ప్రాంగణం కోలాహలంగా మారింది.
Andhra
రైల్వేకోడూరులో ఆర్‌పీఐ (అథవాలే) పార్టీ కార్యాలయం ప్రారంభం
Quick Summary:
రైల్వేకోడూరులో ఆర్‌పీఐ (అథవాలే) పార్టీ కార్యాలయం ప్రారంభం


