మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం!
కేవీఆర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. 22 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
జై భీమ్ వాయిస్ టుడే,నందిగామ,నవంబర్ 02
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం కేవీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారులు లోవరాజు, నూతక్కి సురేష్‌బాబు పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
కౌంటింగ్ కేంద్రంలో 32 వార్డులకు సంబంధించిన వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలను కూడా లెక్కించనున్నారు. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు కోసం 16 టేబుళ్లు, చైర్పర్సన్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ముందుగా మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు.
కౌంటింగ్ విధివిధానాలపై సోమవారం సంబంధిత అధికారులు, ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సమయంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సోమవారం సాయంత్రానికే కేవీఆర్ కళాశాలలోని కౌంటింగ్ హాళ్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Andhra
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం! కేవీఆర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. 22 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
Quick Summary:
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం! కేవీఆర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. 22 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు